
సినిమాలు

మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రవళిక మరణవార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగి మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!