2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

Writer: Chandrika 03:34 PM, 2 సెప్టెంబర్, 2026
నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

కరోనా, లాక్‌డౌన్‌ కష్టకాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి ‘రియల్‌ హీరో’గా ప్రశంసలు అందుకున్న నటుడు సోనూ సూద్‌ తాజాగా నేపాల్‌ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. నిత్యావసరాలు, సహాయక సామగ్రితో నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూకు వెళ్లిన ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పునరావాస కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితిని చూసి తన మనసు ముక్కలైందని సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. వరదల్లో తల్లిదండ్రులను కోల్పోయిన లేదా వారి ఆచూకీ తెలియక బాధపడుతున్న పిల్లలను చూడటం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఓ పునరావాస కేంద్రంలో క్రిస్టినా అనే ఎనిమిదేళ్ల చిన్నారిని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తమ్ముడితో ఉన్న ఆ చిన్నారి తనను చూసి నవ్వుతూ ‘అంతా సర్దుకుంటుంది’ అని చెప్పిందని, ఆమె మాటలు తనను తీవ్రంగా కదిలించాయని తెలిపారు. ఆ చిన్నారిని దత్తత తీసుకోవాలనిపించిందని, అయితే పరిస్థితులు తనను ఏమీ చేయలేని స్థితిలో ఉంచాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు తమకు చేతనైనంతగా నేపాల్‌ వరద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోనూ సూద్‌ పిలుపునిచ్చారు. మనం సురక్షిత ప్రాంతాల్లో ఉన్నందుకు అదృష్టవంతులమని, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి కుటుంబాల కోసం కొంత సమయం కేటాయించాలని కోరారు. విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడం ప్రభుత్వం, మంత్రుల బాధ్యత మాత్రమే కాదని, ఒక మనిషిగా, భారతీయుడిగా మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. “వాళ్లు ఇళ్లను, కుటుంబాలను, అందమైన బాల్యాన్ని కోల్పోయారు. మనమంతా కలిసి వారికి కొత్త జీవితాన్ని అందిద్దాం. నేపాల్‌.. నువ్వు ఒంటరివి కావు” అని సోనూ సూద్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

ట్యాగ్లు
సోనూ సూద్‌నేపాల్‌ వరదలునేపాల్‌ వరద బాధితులుకాఠ్‌మాండూవరద సహాయక చర్యలుసహాయక సామగ్రిమానవతా సహాయంసోనూ సూద్‌ సేవలువిపత్తు సహాయంవైరల్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..
టెక్నాలజీ

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు
జనరల్

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...
జనరల్

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్
జనరల్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం
క్రీడలు

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?
క్రీడలు

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళం కుర్రాడు..
క్రీడలు

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళం కుర్రాడు..

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!