
బిజినెస్

నేపాల్‌లో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సాయం చేసేందుకు నటుడు సోనూసూద్ ముందుకొచ్చారు. నిత్యావసర వస్తువులు, సహాయక సామగ్రితో రాజధాని కాఠ్‌మాండూకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ‘‘మనమంతా కలిసి వారికి కొత్త జీవితాన్ని అందిద్దాం. నేపాల్.. నువ్వు ఒంటరివి కావు’’ అంటూ ఆయన పేర్కొన్నారు.
సోనూసూద్ సహాయక చర్యలపై ఓ జర్నలిస్ట్ విమర్శలు చేస్తూ, ఇవన్నీ ప్రచారం కోసమేనంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సోనూసూద్ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సానుకూలంగా స్పందించారు. ‘‘సోదరా.. మీరు చాలా మంచి వారు. నేపాల్‌కు రండి. మనమిద్దరం కలిసి అక్కడి ప్రజలకు సహాయం చేద్దాం’’ అంటూ ఆహ్వానించారు. విమర్శించిన వ్యక్తినే సహాయక చర్యల్లో భాగస్వామి కావాలని కోరిన ఆయన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!