

ఇటీవల సంభవించిన తీవ్ర వరదల కారణంగా నేపాల్‌లోని జలవిద్యుత్ మౌలిక వసతులు భారీగా దెబ్బతినడంతో ఆ దేశం విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ సమయంలో పొరుగు దేశమైన నేపాల్‌కు అండగా నిలిచేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (NEA)కి రోజుకు 18 గంటల పాటు, అర్ధరాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి 2026 సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది.
ముజఫర్‌పూర్–ధాల్కేబార్ 400 కేవీ డబుల్ సర్క్యూట్ లైన్ ద్వారా గరిష్ఠంగా 600 మెగావాట్లు, తనాక్‌పూర్–మహేంద్రనగర్ 132 కేవీ సింగిల్ సర్క్యూట్ లైన్ ద్వారా మరో 54 మెగావాట్ల వరకు భారత్ విద్యుత్‌ను నేపాల్‌కు అందించనుంది. 2027 జనవరి నుంచి ఎంత పరిమాణంలో విద్యుత్ సరఫరా చేయాలనే అంశంపై 2026 డిసెంబర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. సంక్షోభ సమయంలో నేపాల్ విద్యుత్ అవసరాలను తీర్చడం ద్వారా ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న దౌత్య, ఇంధన సహకారం మరింత బలోపేతమవుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!