
జనరల్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చగా, థియేటర్ యాజమాన్యం సహా మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పుష్ప-2 బెన్‌ఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఇప్పటికే 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. అల్లు అర్జున్ వర్చువల్ హాజరు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు నేపథ్యంలో మీడియా, సోషల్ మీడియాపై గ్యాగ్ ఆర్డర్ కూడా జారీ చేయబడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!