
సినిమాలు

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి జరిగింది. యెమెన్ జలాల సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఎంఎస్‌వీ ఫైజ్ నూరే ఓలియా నౌక తీవ్రంగా దెబ్బతిని నీట మునిగిపోయింది. దాడి సమయంలో నౌకలో ఉన్న 14 మంది సిబ్బందిని యెమెన్ తీర రక్షక దళం సురక్షితంగా రక్షించింది. ఇందులో 13 మంది భారతీయులు, ఒక యెమెన్ పౌరుడు ఉన్నారు. వారికి తక్షణ వైద్య సహాయం అందించారు.
ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ స్పందిస్తూ, నౌకపై ఎలాంటి కారణం లేకుండా జరిగిన దాడిని అంగీకరించబోమని తెలిపారు. రక్షించబడిన భారతీయ నావికులకు అవసరమైన సహాయం అందించేందుకు అన్ని సంస్థలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!