
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరోసారి క్రమంగా పెరుగుతున్నాయి. తాజా ఆరోగ్య బులెటిన్ ప్రకారం ఒక్కరోజులో ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా నాలుగు కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరిలో రెండు, బాపట్ల జిల్లాలో ఒక కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కు చేరింది.
ప్రస్తుతం 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో తొమ్మిది మంది హోం ఐసొలేషన్‌లో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు ముగ్గురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా కారణంగా మొత్తం నలుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న ఆరోగ్య శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!