
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రాన్ని డిజిటల్‌గా మార్ఫింగ్ చేసి, ఆయన ప్రసంగించినట్లు అసత్య వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ వీడియో రూపొందించినట్లు అధికారులు గుర్తించారు.
సైబర్ క్రైం ఎస్సై పి. జయప్రకాశ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పరిశీలిస్తున్న సమయంలో ఈ వీడియోను గుర్తించారు. ఆ వీడియోలో ఉన్న అసత్య వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, వీడియో రూపొందించినవారిపై దర్యాప్తు ప్రారంభించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!