

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోషల్ మీడియాలో మరో మైలురాయిని చేరుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన అధిగమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్‌కు సోషల్ మీడియాలో ఆదరణ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.87 కోట్ల మంది అనుసరిస్తుండగా, రాహుల్ గాంధీకి 1.47 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఈ పరిణామం విజయ్ డిజిటల్ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌కు సుమారు 23 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) నాయకులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ పార్టీ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరియు ప్రజా కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!