

దసరా పండుగ సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నగరంలో నివసిస్తున్న పలువురు సొంతూళ్లకు వెళ్లేందుకు బయలుదేరడంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలోనూ భారీ రద్దీ కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో ప్రధాన రవాణా కేంద్రాలు రద్దీగా మారాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులు ముందుగానే టికెట్లు, రైలు లేదా బస్సు సమయాలను పరిశీలించుకోవాలని, స్టేషన్లు, బస్టాండ్లకు చేరుకోవడానికి అదనపు సమయం కేటాయించాలని సూచిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!