

అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యాంకరేజ్‌లోని మెరిల్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నుంచి సెల్డోవియా వెళ్తున్న పైపర్ పీఏ-24 చిన్న విమానం అదుపుతప్పి సెల్డోవియా స్లఫ్‌లోని నీటిలో కూలిపోయింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురూ మృతి చెందారు. ప్రమాదం తర్వాత విమానం పూర్తిగా నీటిలో మునిగిపోయి సుమారు 15 అడుగుల లోతులో ఉన్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అధికారులు తెలిపారు.
నీటి మట్టం, ఆటుపోట్ల కారణంగా సహాయక సిబ్బంది వెంటనే విమానం వద్దకు చేరుకోలేకపోయారు. అనంతరం అధికారులు అక్కడికి చేరుకుని నలుగురు మృతుల మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా వయోజనులేనని అధికారులు తెలిపారు. మృతదేహాలను వైద్య పరీక్షల కోసం స్టేట్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించారు. ప్రమాదానికి అసలు కారణమేంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!