

ఆస్ట్రేలియా U19 జట్టు భారత్ పర్యటన నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా U19తో జరగనున్న మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌ల కోసం వేర్వేరు భారత్ U19 జట్లను ఎంపిక చేసింది. మూడు వన్డేలకు లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్‌గా, యశబర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మల్టీ-డే మ్యాచ్‌లకు యశబర్ధన్ చౌహాన్ కెప్టెన్‌గా, లక్ష్య రాయ్‌చందానీ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మూడు వన్డేలు, తొలి మల్టీ-డే మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుండగా.. రెండో మల్టీ-డే మ్యాచ్ అహ్మదాబాద్‌లోని బీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు.
ఈ వన్డే జట్టులో మాజీ భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, మాజీ భారత కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌కు చోటు దక్కింది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యవీర్ 2024 కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై 297 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లోనూ రాణించిన అతడికి తొలిసారి భారత్ U19 జట్టులో అవకాశం లభించింది. వికెట్‌కీపర్-బ్యాటర్ అన్వయ్ ద్రవిడ్ శ్రీలంక పర్యటనలో భారత్ U19 తరఫున 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆర్యవీర్, అన్వయ్ ఇద్దరూ వన్డే జట్టులో మాత్రమే ఉన్నారు; మల్టీ-డే జట్టులో వారికి చోటు దక్కలేదు.
వన్డే సిరీస్
సెప్టెంబర్ 18, 2026 – తొలి వన్డే, రాజ్‌కోట్
సెప్టెంబర్ 21, 2026 – రెండో వన్డే, రాజ్‌కోట్
సెప్టెంబర్ 23, 2026 – మూడో వన్డే, రాజ్‌కోట్
మల్టీ-డే మ్యాచ్‌లు
సెప్టెంబర్ 27–30, 2026 – తొలి మ్యాచ్, రాజ్‌కోట్
అక్టోబర్ 5–8, 2026 – రెండో మ్యాచ్, అహ్మదాబాద్ బీ గ్రౌండ్



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!