22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

Writer: Nithish 06:11 AM, 22 సెప్టెంబర్, 2026
ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

కోస్తాంధ్రలో సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 22న భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ తర్వాత రెండు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా బలపడగా, రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఇది సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజామున మధ్య విశాఖపట్నం–గోపాల్‌పూర్‌ మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లా శంఖవరంలో 60.75 మిల్లీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వంశధార, నాగావళి నదుల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసే నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వాగులు, ప్రమాదకర కాజ్‌వేల వద్ద రాకపోకలను నియంత్రించాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ వాతావరణంకోస్తాంధ్ర వర్షాలురెడ్ అలర్ట్బంగాళాఖాతం వాయుగుండంభారీ వర్షాలుఉత్తరాంధ్రవిశాఖపట్నం వాతావరణంవంశధార నదినాగావళి నదిఐఎండీ హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
జనరల్

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం
టెక్నాలజీ

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం
జనరల్

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం
జనరల్

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ
జనరల్

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు
జనరల్

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!