22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

Writer: Nithish 05:23 AM, 22 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

వీకెండ్ ఎపిసోడ్ ముగిసిన అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ముందుగా సృష్టి, త్రిగుణ్‌తో సుధీర్ గురించి మాట్లాడిన సన్నివేశాలను చూపించారు. అనంతరం సుధీర్, వర్షిణి మధ్య సంభాషణ జరిగింది. మరోవైపు దేబ్జానీ కాఫీ విషయంలో రామ్ ప్రసాద్‌తో చర్చించింది. ఆ తర్వాత ముకేశ్‌ను బిగ్‌బాస్ లోపలికి పిలిచి ‘టెంప్టేషన్స్ & టెన్షన్స్’ కార్డు ఇచ్చారు. టెంప్టేషన్‌ను ఎంచుకోవడంతో ఈ వారం నామినేషన్స్ నుంచి ముకేశ్ ఇమ్యూనిటీ పొందాడు.

అదే సమయంలో ఝాన్సీకి సంబంధించిన రెండు ఆప్షన్లను ముకేశ్‌కు ఇచ్చారు. ఝాన్సీకి ఇమ్యూనిటీ కొనసాగించాలా? లేక ఆమెను కెప్టెన్‌గా తొలగించి ఆ స్థానాన్ని త్రిగుణ్‌కు ఇవ్వాలా? అని అడిగారు. ముకేశ్ ఝాన్సీ ఇమ్యూనిటీని తొలగించడానికే మొగ్గుచూపాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఝాన్సీతో చెప్పగా.. ఆమె కూడా ముకేశ్ నిర్ణయాన్ని అంగీకరించింది. మరోవైపు సుధీర్-సృష్టి మధ్య రిలేషన్, గతంలో వారు మాట్లాడుకున్న విషయాలపై హౌస్‌లో చర్చ జరిగింది.

నామినేషన్స్‌లో ఎవరు పాల్గొనాలనే విషయాన్ని నిర్ణయించేందుకు బిగ్‌బాస్ ఎన్వలప్ గేమ్ నిర్వహించారు. ముకేశ్‌ను అడగ్గా రామ్ ప్రసాద్, చరణ్ పేర్లను సూచించాడు. అయితే చివరకు రామ్ ప్రసాద్ మాత్రమే నామినేషన్స్‌కు అర్హత సాధించాడు. అతడికి వచ్చిన ఎన్వలప్‌లో రెండు నామినేషన్స్ చేయవచ్చని, లేదా ఒక నామినేషన్ తాను చేసి మరొకరికి అవకాశం ఇవ్వవచ్చని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో రామ్ ప్రసాద్ వంశీని నామినేట్ చేశాడు. ఆ తర్వాత రెండో అవకాశాన్ని రోహిత్‌కు ఇచ్చాడు. రామ్ ప్రసాద్ తనను పరీక్షించేందుకే ఈ అవకాశం ఇచ్చాడని రోహిత్ చెప్పి సుధీర్‌ను నామినేట్ చేశాడు.

సుధీర్‌ను నామినేట్ చేసే సమయంలో వర్షిణి అతడిని కంట్రోల్ చేస్తుందంటూ రోహిత్ పాత విషయాలను ప్రస్తావించడంతో సుధీర్-సృష్టి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సృష్టి సుధీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన క్యారెక్టర్‌ను తప్పుగా చూపిస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలో సుధీర్, త్రిగుణ్ పేరును ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య కూడా గొడవ తీవ్రరూపం దాల్చింది. కొట్టుకునే స్థాయికి వెళ్లిన పరిస్థితిని ఇతర హౌస్‌మేట్స్ అదుపు చేసే ప్రయత్నం చేశారు. అనంతరం అమన్, సుధీర్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది.

తర్వాత వర్షిణికి నామినేషన్ అవకాశం రాగా, ఆమె షాలినిని నామినేట్ చేసింది. సుధీర్ అమన్‌ను నామినేట్ చేశాడు. అనంతరం చరణ్‌కు రెండు అవకాశాలు రావడంతో ఒక అవకాశాన్ని దేబ్జానీకి ఇచ్చాడు. చరణ్ ఝాన్సీని నామినేట్ చేస్తూ ఆమె ‘రైతు బిడ్డ’ అనే అంశాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవద్దని, షర్ట్, టవల్ విషయంలోనూ తనకు అభ్యంతరం ఉందని చెప్పాడు. దీనిపై ఝాన్సీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. మరోవైపు దేబ్జానీ కాఫీ దొంగతనం చేశారనే కారణంతో త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. ఇంతటితో నామినేషన్స్‌ను ఆపిన బిగ్‌బాస్.. తదుపరి ఎపిసోడ్‌లో ప్రక్రియను కొనసాగించనున్నాడు. చివర్లో ముకేశ్‌కు ‘బెస్ట్ ప్లేయర్’ గుర్తింపు రావడంపై చరణ్ ప్రశ్నలు సంధించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ నామినేషన్స్సృష్టిసుధీర్ముకేశ్వర్షిణిరామ్ ప్రసాద్త్రిగుణ్చరణ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!