
జనరల్

ఢిల్లీలో భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా, 15 మందిని రెస్క్యూ టీమ్‌లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానాలు ఉండటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్పత్రికి వెళ్లారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థుల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నట్లు సమాచారం. కొందరు ఫోన్ల ద్వారా తమను రక్షించాలని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాత్రి సమయం కావడంతో శిథిలాలను తొలగించి బాధితులను గుర్తించడం రెస్క్యూ సిబ్బందికి సవాలుగా మారింది. అయినప్పటికీ, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!