

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా పేరు, గొంతు, రూపురేఖలను ఉపయోగిస్తున్నారంటూ అమితాబ్ కోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణలోగా ప్రతివాదులతో సెటిల్మెంట్ పూర్తికాకపోతే అమితాబ్ స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ స్పష్టం చేశారు. ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు సమయం ఇచ్చిన కోర్టు, తదుపరి విచారణను నవంబర్ 16, 2026కు వాయిదా వేసింది.
2022లోనే తన వ్యక్తిత్వ, ప్రచార హక్కులను కాపాడాలని కోరుతూ అమితాబ్ హైకోర్టును ఆశ్రయించారు. లాటరీ పథకాలు, వ్యాపారాలు, డిజిటల్ ఉత్పత్తుల్లో తన పేరు, గొంతు, చిత్రాన్ని అనుమతి లేకుండా ఉపయోగించకుండా మధ్యంతర ఎక్స్ పార్టే ఉత్తర్వులు పొందారు. అనంతరం కొందరు ప్రతివాదులతో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఒప్పందం దాదాపు ఖరారైనప్పటికీ, అమితాబ్ తరఫున కొన్ని లాజిస్టికల్ కారణాలతో సంతకాల ప్రక్రియ ఆలస్యమైంది. సెటిల్మెంట్ పూర్తికాకపోతే వర్తించే చట్ట నిబంధనల ప్రకారం ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు రావాల్సి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!