
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలో కార్యక్రమం అనంతరం రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన ఆయన. జ్వరం కారణంగా ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజమహేంద్రవరంలోనే మరో కార్యక్రమాన్ని మధ్యలో ముగించారు. అనంతరం వైద్యులు పవన్ కళ్యాణ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్యుల పరీక్షల అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇటీవల ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీకి సంబంధించి వైద్యుల సూచనలు తీసుకోనున్నారు. జ్వరం తీవ్రతపై లోక్‌భవన్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!