

నటుడు నాని అభ్యర్థనపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌కు వెళ్లేందుకు నాని అనుమతి కోరారు. అయితే గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్, భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని డీజీపీ తెలిపారు. నిమజ్జన వాహనాలు, భక్తుల రాకపోకలతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌పై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, అక్కడ ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా హైదరాబాద్ సిటీ పోలీసుల అనుమతి కీలకమని స్పష్టం చేశారు.
రెండేళ్ల క్రితం ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను కూడా సీవీ ఆనంద్ ప్రస్తావించారు. ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో భద్రత, జనసమూహ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులతో సంప్రదింపులు జరిపిన అనంతరం నాని కార్యక్రమంపై తుది నిర్ణయం తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!