
టెక్నాలజీ

వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ట్రాఫిక్ ఈ-చలాన్లపై 50 శాతం రాయితీ ప్రకటించింది. జిల్లా సెషన్స్ జడ్జి ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం, 2026 మే నెలలో పోలీసు శాఖలో నమోదైన ఈ-చలాన్లతో పాటు, రవాణా శాఖలో 1991 నుంచి 2022 వరకు నమోదైన చలాన్లపై ఈ రాయితీ వర్తిస్తుంది. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ రాయితీ కింద ప్రజలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 10 వరకు తమ పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా పెండింగ్ ఫైన్లను తగ్గించడమే కాకుండా, ట్రాఫిక్ నియమాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిమిత కాల ఆఫర్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు లాభపడనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!