
జనరల్

హైదరాబాద్ నగరంలో ఎబోలా తరహా లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్తించబడటంతో కలకలం రేగింది. ఆఫ్రికా దేశాల ప్రయాణ చరిత్ర ఉన్న ఈ ఇద్దరిని రాత్రికి రాత్రే ప్రైవేటు ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎబోలా అనుమానంతో వైద్యులు హై అలర్ట్ ప్రకటించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు మార్చారు.
వైద్యుల సమాచారం ప్రకారం ఇద్దరికీ తీవ్రమైన జ్వరం లక్షణాలు ఉన్నాయి. వారి రక్తం, లాలాజలం నమూనాలను సీసీఎంబీ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. 24 నుంచి 48 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్‌గా తేలితే పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ధృవీకరణ కోసం పంపనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!