

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఫౌజీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను హను రాఘవపూడి సరికొత్త ప్రపంచంలో ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు కూడా మంచి స్పందనను అందుకోవడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
తాజాగా ఫౌజీ ప్రమోషనల్ కంటెంట్‌కు సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని ఈ నెల నుంచే సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇకపై రానున్న ప్రతి కంటెంట్ ప్రేక్షకుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఫౌజీ నుంచి రాబోయే అప్‌డేట్స్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 2న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ నెల నుంచి ప్రారంభం కానున్న ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!