

తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు కీలక భాగస్వాములుగా మారాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో జరిగిన 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కేవలం ప్రభుత్వ వ్యయంతో ఈ లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదని, భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులు, బలమైన ఆర్థిక సంస్థలు, లోతైన ఆర్థిక మార్కెట్లు, వినూత్న నిధుల విధానాలు అవసరమని స్పష్టం చేశారు.
బ్యాంకుల పనితీరును కేవలం రుణ లక్ష్యాల ఆధారంగా కాకుండా, వాటి ద్వారా ఏర్పడిన పరిశ్రమలు, ఉద్యోగాలు, వ్యవసాయ ఉత్పాదకత, గ్రామీణ ఆదాయం వంటి అంశాలతో అంచనా వేయాలని భట్టి సూచించారు. అర్హత ఉన్న రైతులకు అవసరమైన సమయంలోనే రుణాలు అందించాలని, వారు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థే రైతుల వద్దకు వెళ్లాలని, డెయిరీ, మత్స్య, ఉద్యాన, పామాయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనుబంధ రంగాలకు రుణాలను విస్తరించాలని సూచించారు. జూన్ 2026 నాటికి వ్యవసాయ రంగానికి బ్యాంకులు రూ.52,337 కోట్ల రుణాలు అందించాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!