

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ వరకు 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుగా పెరిగే సామర్థ్యం కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేశారు.
ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అడవులు, కొండలు, నదీ తీర ప్రాంతాల్లో సీడ్ బాల్స్‌ను వెదజల్లే ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో వాటిని చల్లనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంలో మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడంలో కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!