

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’పై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ మరోసారి ప్రశంసలు కురిపించారు. నమీత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన, ఈ సినిమాకు ఆస్కార్ రాకపోతే అకాడమీ అవార్డ్స్ జ్యూరీపై తీవ్రంగా నిరాశ చెందుతానని అన్నారు. ఇది సాధారణ సినిమా కాదని, వేల సంవత్సరాల పాటు గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఫడణవీస్ ‘రామాయణ’పై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధానితో కలిసి సినిమా సెట్స్‌ను సందర్శించినప్పుడు అక్కడి నిర్మాణ నాణ్యత తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. భారతీయ సంప్రదాయ కథలకు ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త తరానికి అందించేందుకు ఈ చిత్రం మంచి మార్గమని అన్నారు. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 6న విడుదల కానుంది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయిందని రణ్‌బీర్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!