
ఓటీటీ

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలికి సమర్పించిన ఫైర్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల (ఎన్‌ఓసీలు)లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. పరిశీలించిన 142 కాలేజీలలో 52 కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన కాలేజీల జాబితాను హైడ్రా పోలీసులకు అందజేయడంతో కేసుపై దర్యాప్తు ప్రారంభమైంది.
దర్యాప్తులో మాజీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. నకిలీ ధ్రువపత్రాలు ఎలా తయారయ్యాయి, వాటిని ఎవరు సమర్పించారు, ఈ వ్యవహారంలో మరెవరి పాత్ర ఉందనే కోణాల్లో పోలీసులు సమగ్ర విచారణ చేపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!