28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పండగ సీజన్‌కు ముందే షాక్: పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు

Writer: Sreekanth Reddy 08:31 AM, 28 సెప్టెంబర్, 2026
పండగ సీజన్‌కు ముందే షాక్: పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు

పండగ సీజన్ ప్రారంభానికి ముందే వినియోగదారులకు షాక్ తగలనుంది. ఏసీలు, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి గృహోపకరణాల ధరలు అక్టోబర్ 1 నుంచి పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలు 5 నుంచి 8 శాతం వరకు ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాదిలో ఇలా ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

రాగి, ఉక్కు, అల్యూమినియం వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కరెన్సీ మారకం విలువలో వస్తున్న హెచ్చుతగ్గులే ఈ పెంపునకు ప్రధాన కారణాలని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. ఏసీల ధరలు 5 నుంచి 8 శాతం మేర పెరగనుండగా, టీవీలు, వాషింగ్ మెషిన్ల ధరలు 3-4 శాతం వరకు పెరగనున్నాయి.

బ్లూస్టార్, గోద్రెజ్, హయర్, దైకిన్ వంటి సంస్థలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించాయి. ఎల్జీ, వోల్టాస్, హిటాచి బ్రాండ్ ఏసీలను విక్రయించే బాష్ హోమ్ కంఫర్ట్ కూడా సుమారు 5 శాతం ధరలను పెంచినట్లు తెలుస్తోంది. ముడిసరుకుల ధరల పెరుగుదల వల్లే ధరలు పెంచక తప్పడం లేదని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. రాగి ధర గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిందని, అందుకే ఏసీల ధరలను 5 శాతం పెంచుతున్నామని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్.ఎస్.సతీష్ వివరించారు.

అయితే, డీలర్ల వద్ద పాత స్టాక్ ఒకటి, ఒకటిన్నర నెలల పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో దీపావళి వరకు వినియోగదారులకు కొంతమేర పాత ధరలకే ఉత్పత్తులు లభించవచ్చు. దీపావళి తర్వాత కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

నేడు విజయవాడ ఉత్సవ్‌ కర్టన్‌ రైజర్‌

నేడు విజయవాడ ఉత్సవ్‌ కర్టన్‌ రైజర్‌

రోడ్డు తనిఖీలో ఢిల్లీ మంత్రి వీరంగం.. యువకుడిపై చెంపదెబ్బ

రోడ్డు తనిఖీలో ఢిల్లీ మంత్రి వీరంగం.. యువకుడిపై చెంపదెబ్బ

తమిళనాడులో నేడు కీలక పథకం ప్రారంభం

తమిళనాడులో నేడు కీలక పథకం ప్రారంభం

సర్‌ ప్రక్రియపై ఈసీ వివరణ ఇవ్వాలి - మహేశ్ గౌడ్

సర్‌ ప్రక్రియపై ఈసీ వివరణ ఇవ్వాలి - మహేశ్ గౌడ్

ట్యాగ్లు
దసరాదీపావళిసేల్స్పెరగనున్న ధరలుటీవీఫ్రిజ్ఏసీవాషింగ్ మిషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయి పల్లవి స్పీచ్‌.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ వైరల్
సినిమాలు

సాయి పల్లవి స్పీచ్‌.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ వైరల్

ఆ స్టార్ డైరెక్టర్‌తో ఛాన్స్ మిస్.. ఇప్పటికీ నేను ఎదురుచూస్తున్నా - సూర్య
సినిమాలు

ఆ స్టార్ డైరెక్టర్‌తో ఛాన్స్ మిస్.. ఇప్పటికీ నేను ఎదురుచూస్తున్నా - సూర్య

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన
జనరల్

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

ప్రీపెయిడ్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్
బిజినెస్

ప్రీపెయిడ్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్
ఓటీటీ

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

డీజే సౌండ్స్‌పై పోలీసులకు అల్లు శిరీష్‌ ఫిర్యాదు
సినిమాలు

డీజే సౌండ్స్‌పై పోలీసులకు అల్లు శిరీష్‌ ఫిర్యాదు

వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...ఈ షేర్లపై ఫోకస్
బిజినెస్

వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...ఈ షేర్లపై ఫోకస్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

అక్టోబరు 2న ఆందోళనకు అనుమతివ్వకపోతే జైల్‌భరో ఆందోళన్‌: సీజేపీ
రాజకీయాలు

అక్టోబరు 2న ఆందోళనకు అనుమతివ్వకపోతే జైల్‌భరో ఆందోళన్‌: సీజేపీ

నేడు విజయవాడ ఉత్సవ్‌ కర్టన్‌ రైజర్‌
జనరల్

నేడు విజయవాడ ఉత్సవ్‌ కర్టన్‌ రైజర్‌

రోడ్డు తనిఖీలో ఢిల్లీ మంత్రి వీరంగం.. యువకుడిపై చెంపదెబ్బ
జనరల్

రోడ్డు తనిఖీలో ఢిల్లీ మంత్రి వీరంగం.. యువకుడిపై చెంపదెబ్బ

తమిళనాడులో నేడు కీలక పథకం ప్రారంభం
జనరల్

తమిళనాడులో నేడు కీలక పథకం ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!