14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Nithish 04:57 PM, 14 నవంబర్, 2026
రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో కలిసి నడవడం, పరుగెత్తడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. భారత్‌ సమిట్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిగ్‌ వర్కర్ల ర్యాలీ సందర్భంగా తాను పరుగెత్తిన ఘటనపై వివరణ ఇచ్చారు. తాను ఎక్కిన బైక్‌ స్కిడ్‌ కావడంతో మరో బైక్‌ ఎక్కేందుకు వెనక్కి వెళ్లానని, అనంతరం రాహుల్‌ గాంధీ పిలవడంతో తిరిగి ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లానని తెలిపారు. తాను ఫిట్‌గా ఉన్నందుకే అలా పరుగెత్తగలిగానని, దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు బాధపడుతున్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాహుల్‌తో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించానని, సోనియా గాంధీ పుస్తకంపై ఆయన అభిప్రాయాలను తెలుసుకున్నానని చెప్పారు.

రాహుల్‌ గాంధీకి కుర్తా పైజామా వేసుకుంటే బాగుంటుందని తాను సలహా ఇచ్చినట్లు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. భారత్‌ సమిట్‌ ముగింపు కార్యక్రమంలో రాహుల్‌ అదే దుస్తుల్లో కనిపించడంతో తన సూచనను పాటించారని అన్నారు. సోనియా గాంధీ ఆత్మకథను మరో మూడు నెలల్లో తెలుగులోకి అనువదించనున్నట్లు తెలిపారు. ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసి వివిధ పార్టీల నాయకులు, అధికారులు, జర్నలిస్టులకు అందజేస్తానని, కేసీఆర్‌కు కూడా ఒక ప్రతిని ఇస్తానని చెప్పారు. హైదరాబాద్‌ చాయ్‌, బన్‌ మస్కా అంటే రాహుల్‌ గాంధీకి ఇష్టమని, గిగ్‌ వర్కర్ల సమస్యలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై వక్తల విమర్శలు

భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై వక్తల విమర్శలు

గిగ్‌ వర్కర్ల రక్షణకు ప్రత్యేక చట్టం.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

గిగ్‌ వర్కర్ల రక్షణకు ప్రత్యేక చట్టం.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

గిగ్ వర్కర్లకు అండగా ఉంటాం : రాహుల్ గాంధీ

గిగ్ వర్కర్లకు అండగా ఉంటాం : రాహుల్ గాంధీ

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ

ట్యాగ్లు
రాహుల్‌ గాంధీమహేశ్‌కుమార్‌ గౌడ్‌టీపీసీసీభారత్‌ సమిట్‌గిగ్‌ వర్కర్లుసోనియా గాంధీకుర్తా పైజామాకాంగ్రెస్‌తెలంగాణ రాజకీయాలుకేసీఆర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం
క్రీడలు

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు
సినిమాలు

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు

యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ
జనరల్

యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ

మహిళా నేతలను పలకరించే విషయంలో మెక్రాన్‌ తీరు మరోసారి చర్చనీయాంశం
జనరల్

మహిళా నేతలను పలకరించే విషయంలో మెక్రాన్‌ తీరు మరోసారి చర్చనీయాంశం

ఉదయాన్నే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? ఆఫీసులో ఇబ్బందులు తప్పవు
ఆరోగ్యం

ఉదయాన్నే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? ఆఫీసులో ఇబ్బందులు తప్పవు

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత
సినిమాలు

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్
సినిమాలు

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా
బిజినెస్

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. మిస్ కాకూడని సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. మిస్ కాకూడని సినిమాలు, సిరీస్‌లు

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్
బిజినెస్

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!