
జనరల్

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో "ఎగుమతి అవకాశాలు – ఎగుమతి వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి" అనే అంశంపై ఆగస్టు 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లో రెండు రోజుల సర్టిఫికెట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, ఎగుమతిదారులు, వ్యాపారవేత్తలకు అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ శిక్షణలో ఎగుమతి విధానాలు, డాక్యుమెంటేషన్, చట్టపరమైన నిబంధనలు, ట్రేడ్ ఫైనాన్స్, జీఎస్‌టీ, ఎగుమతి ప్రోత్సాహకాలు, విదేశీ కొనుగోలుదారుల గుర్తింపు, ఎఫ్‌టీఏలు, క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే బ్యాంకులు, ఈసీజీసీ అధికారులతో ప్రత్యక్షంగా చర్చించే అవకాశం కల్పించనుండగా, శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేయనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!