
జనరల్

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. బుధిగండకి నది ఉధృతంగా ప్రవహించడంతో గోర్ఖా ప్రాంతంలోని సల్లెరి బజార్ వరదలో కొట్టుకుపోయింది. ఆకస్మికంగా వచ్చిన వరద ప్రవాహంతో స్థానికంగా తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం.
వరద ఉధృతికి కొండచరియలు విరిగిపడి నదిలో పడటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ప్రభావిత ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. వరదల వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!