

విశాఖపట్నం విమానాశ్రయానికి 80 ఏళ్ల చరిత్ర ఉంది. ఇన్నేళ్లుగా నగరానికి విమాన సేవలు అందించిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో దేశీయ విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి దేశీయ విమాన సర్వీసులు నిలిపివేయనున్నట్లు సమాచారం. దీంతో ఇన్నేళ్లుగా ఈ విమానాశ్రయంపై ఆధారపడిన విశాఖ నగరవాసులు, ప్రయాణికుల్లో భావోద్వేగం నెలకొంది.
మరోవైపు విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం, ఆగస్టు 17 నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం నుంచి దేశీయ విమానాలను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!