
క్రీడలు

వైఎస్సార్ జిల్లాలో తాజాగా ఆరు కొత్త కోవిడ్ 19 కేసులు నమోదుకావడంతో ఆందోళన నెలకొంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటికే కడప మరియు రాజంపేటకు చెందిన ఇద్దరు కోవిడ్ బారిన పడి మృతి చెందగా, వారిలో ఒకరి కుటుంబ సభ్యుడికి కూడా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా కేసులతో జిల్లాలో మొత్తం ఎనిమిది కోవిడ్ కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తగిన ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రిమ్స్‌లో కోవిడ్ వార్డు ఏర్పాటు చేసినప్పటికీ, కోవిడ్ ప్రోటోకాల్ అమలులో నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారుల స్పందన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!