
క్రీడలు

ప్రధానమంత్రి కిసాన్ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ, అన్నదాత సుఖీభవ పథకం నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమైంది. శనివారం సాయంత్రం ఐదు గంటల నాటికి ప్రధానమంత్రి కిసాన్ పథకం నిధులు నూరు శాతం, అన్నదాత సుఖీభవ నిధులు 99.80 శాతం రైతుల ఖాతాల్లో జమయ్యాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
సాంకేతిక కారణాల వల్ల ఇంకా జమ కాని మొత్తాలను నాలుగు నుంచి ఐదు రోజుల్లో చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నిధులను విడుదల చేశారు. ప్రధాని ప్రసంగం ముగిసే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా వేదికపైకి వెళ్లకుండా సభికులతో కలిసి భారీ తెరపై కార్యక్రమాన్ని వీక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!