

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఢిల్లీలోని మూడు మోసపూరిత కాల్ సెంటర్లపై సమన్వయంతో మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలీకాలర్లు మరియు ఒక పురుష బ్యాంక్ ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ప్రధాన నిర్వాహకులు పరారీలో ఉన్నారు. 23 మొబైల్ ఫోన్లు, 2 బ్యాంక్ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌కు తెలంగాణలో నమోదైన 22 సైబర్ నేర కేసులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ మోసగాళ్లు బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమని చెప్పి ఆకర్షణీయమైన రుణాల పేరుతో బాధితులను మోసం చేశారు. ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజులు, బీమా ప్రీమియం పేర్లతో డబ్బులు వసూలు చేసి తర్వాత సంబంధాలు తెంచుకున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. టీజీసీఎస్‌బీ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, రుణం పేరుతో డబ్బులు చెల్లించే ముందు పూర్తి వివరాలు ధృవీకరించుకోవాలని సూచించింది. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని, సైబర్ క్రైమ్ డాట్ గోవ్ డాట్ ఇన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!