

తెలుగు రాష్ట్రాల్లో అపారమైన ఆదరణ పొందిన బిగ్ బాస్ షో పదో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “బిగ్ బాస్ దశావతారం” కాన్సెప్ట్‌తో విడుదలైన ప్రోమోతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ తన ప్రత్యేక శైలితో ఆకట్టుకోనున్నారు. కంటెస్టెంట్లను ముందుగా తెలుసుకోకుండా హౌస్‌లోనే మొదటిసారి కలవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. హౌస్‌లో హద్దులు దాటి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.
ఈసారి ప్రత్యేకంగా ‘అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షో ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో 15 రోజుల పాటు ఈ డిజిటల్ షో నిర్వహించబడుతుంది. శ్రీముఖి హోస్ట్‌గా, నవదీప్, బిందు మాధవి, అభిజీత్ మెంటర్లు, జడ్జిలుగా పాల్గొననున్నారు. ఇందులో గెలిచిన వారికే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. సెప్టెంబర్ 6న గ్రాండ్ ప్రీమియర్, సెప్టెంబర్ 7 నుంచి రెగ్యులర్ ఎపిసోడ్లు ప్రారంభం కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!