

హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి దరఖాస్తుల గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, తొలి దశలో 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్లను నిర్మించనుంది.
వరుస సెలవుల కారణంగా అర్హులైన ప్రజలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు గడువు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. జూలై 21 నుంచి మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్, మీ-సేవా వాట్సాప్ సేవల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆగస్టు 10 సాయంత్రం నాటికి మొత్తం 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని మరో ఐదు రోజుల పాటు అవకాశం కల్పించినట్లు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!