

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ E20 ఎథనాల్ కలిపిన పెట్రోల్ వాహనాలకు నష్టం చేస్తుందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇవి పూర్తిగా అవాస్తవమని, తప్పుదారి పట్టించే ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. బ్రెజిల్, అమెరికా, థాయిలాండ్ వంటి దేశాలు ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఏళ్లుగా వినియోగిస్తున్నాయని, అక్కడ పెద్దగా సమస్యలు లేవని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఈ “నిపుణులు” సమాచారం ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అమలులోకి వచ్చిన తర్వాత కొన్ని వాహన యజమానులు మైలేజ్ తగ్గడం, పాత వాహనాల్లో పనితీరు సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో చర్చ వేడెక్కింది. ఒకవైపు ప్రభుత్వం శుభ్రమైన ఇంధనం వైపు తీసుకుంటున్న నిర్ణయాన్ని మద్దతు పలుకుతుండగా, మరోవైపు పాత వాహనాలపై దీని దీర్ఘకాల ప్రభావంపై స్పష్టత ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!