
రాజకీయాలు

జిందాల్ స్టీల్ లిమిటెడ్ మరో అరుదైన ఘనత సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ సమీపంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్టీల్ స్లాగ్ రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఉక్కు తయారీ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా వెలువడే స్టీల్ స్లాగ్‌ను ప్రాసెస్ చేసి ఈ రహదారి నిర్మాణానికి వినియోగించారు.
సీఎస్‌ఐఆర్-సీఆర్‌ఆర్‌ఐతో కలిసి జిందాల్ స్టీల్ దాదాపు 2 లక్షల టన్నుల ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్‌తో 1.85 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించింది. సాధారణ రహదారులతో పోలిస్తే స్టీల్ స్లాగ్ రోడ్లు ఎక్కువ కాలం మన్నడంతో పాటు నిర్మాణ వ్యయాన్ని 30–40 శాతం వరకు తగ్గించగలవని కంపెనీ తెలిపింది. వ్యర్థాల నుంచి విలువైన వనరులను సృష్టించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వవచ్చని జిందాల్ స్టీల్ ఛైర్మన్ నవీన్ జిందాల్ అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!