

గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో సింగరేణి స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ మేరకు అధికారులను ఆదేశించారని చెప్పారు. మంథని పట్టణంలోని రావుల చెరువు కట్ట వద్ద హనుమాన్ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణి ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారి ఇళ్ల స్థలాల పట్టాల అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సింగరేణి ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకున్న పలువురి ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి పట్టాలు ఇచ్చిన విషయాన్ని శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. ఇంకా మిగిలి ఉన్న స్థలాల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసి పట్టాల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. సింగరేణి ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పట్టాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవలి అధికారిక ప్రకటనల్లోనూ వెల్లడైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!