

రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరిగిన లక్ష్మీ పూజ వేడుక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్థానిక కాంట్రాక్టర్ సుభాష్ తన ఇంట్లో దీపావళి సందర్భంగా నిర్వహించిన లక్ష్మీ పూజకు భారీ మొత్తంలో కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో సుభాష్ తన భార్య, పిల్లలతో కలిసి పూజలో పాల్గొంటూ కనిపించారు. వారి చుట్టూ రూ.500 నోట్ల కట్టలతో గోడల మాదిరిగా అలంకరణ ఏర్పాటు చేశారు. ఈ నగదు విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
మీడియా కథనాల ప్రకారం, సుభాష్ మద్యం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రతి దీపావళికి ఇదే తరహాలో లక్ష్మీ పూజ నిర్వహించడం తమ కుటుంబ ఆనవాయితీ అని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ వినూత్న వేడుకపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని వ్యక్తిగత భక్తి, కుటుంబ సంప్రదాయంగా భావిస్తుండగా, మరికొందరు భారీ మొత్తంలో నగదును బహిరంగంగా ప్రదర్శించడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సుభాష్ వ్యాపార నేపథ్యం, ఆయనకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న రాజకీయ సంబంధాలు కూడా ఈ ఘటనతో చర్చకు వస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!