
క్రీడలు

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. కామ్రేజ్‌లో 403 మి.మీ., పల్సానాలో 357 మి.మీ. వర్షపాతం నమోదవగా, ఇది దాదాపు 200 ఏళ్లలో నమోదైన అత్యధిక వర్షపాతాల్లో ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు రావడంతో సాధారణ జనజీవనం స్తంభించింది. వరదలకు సంబంధించిన ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, అధికారులు సుమారు 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే 72 గంటల పాటు రాష్ట్రంలో మరింత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!