
ఓటీటీ

హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) జన్యుపరమైన వ్యాధితో మంగళవారం రాత్రి మృతి చెందారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ గత నెలలో అతడిని పరామర్శించి, కుక్కపిల్లను బహుమతిగా అందించారు. అలాగే ‘ఓజీ 2’ సినిమాను కలిసి చూడాలని హామీ ఇచ్చారు.
పవన్ కల్యాణ్‌తో కలవాలన్న నిరంజన్ కోరిక నెరవేరినా, ఆయనతో సినిమా చూడాలన్న ఆశ నెరవేరకుండానే కన్నుమూయడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. నిరంజన్ మృతితో జనసేన అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!