9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగరేణిలో అవినీతి, ప్రైవేటీకరణ కుట్రలు.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్

Writer: Nithish 05:36 AM, 9 అక్టోబర్, 2026
సింగరేణిలో అవినీతి, ప్రైవేటీకరణ కుట్రలు.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థ అవినీతి, బంధుప్రీతి, పరిపాలనా వైఫల్యాలకు నిలయంగా మారిందని భారాస అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో టీబీజీకేఎస్‌ నాయకులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భారాస ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతోందని తెలిపారు. దసరా సమీపిస్తున్నా లాభాల వాటా ప్రకటించకపోవడంపై ప్రశ్నించారు. భారాస ప్రభుత్వ హయాంలో కార్మికులకు 32 శాతం లాభాల వాటా ఇవ్వగా, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అది తగ్గిందని పేర్కొన్నారు.

సింగరేణికి రావాల్సిన సుమారు రూ.50 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం, గనుల ప్రారంభంలో జాప్యం, డిపెండెంట్‌ ఉద్యోగాలపై ఆంక్షలు వంటి అంశాలను హరీశ్‌రావు ప్రస్తావించారు. బొగ్గు ఉత్పత్తి తగ్గుదలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి లాభాల్లో పూర్తి వాటా చెల్లించాలని, అర్హులకు డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పించాలని, సంస్థ ఎన్నికలు నిర్వహించాలని, బకాయిలను త్వరగా చెల్లించాలని కోరారు. ఈ డిమాండ్లతో అక్టోబర్‌ 14న రామగుండంలో ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరవుతారని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ఆదాయానికి రక్షణ కల్పించాలి - భట్టి

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ఆదాయానికి రక్షణ కల్పించాలి - భట్టి

ఏఐ భద్రత, డీప్‌ఫేక్‌లపై కేంద్రం దృష్టి - అశ్వినీ వైష్ణవ్

ఏఐ భద్రత, డీప్‌ఫేక్‌లపై కేంద్రం దృష్టి - అశ్వినీ వైష్ణవ్

ట్యాగ్లు
హరీశ్‌రావుసింగరేణిభారాసతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ ప్రభుత్వంబొగ్గు గని కార్మికులుసింగరేణి కార్మికుల సమస్యలుకేటీఆర్రామగుండంసింగరేణి కార్మిక గర్జన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన
జనరల్

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి
రాజకీయాలు

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి
రాజకీయాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల
జనరల్

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్
సినిమాలు

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం
జనరల్

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

స్టార్‌లింక్‌ అనుమతులపై మస్క్‌ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం
బిజినెస్

స్టార్‌లింక్‌ అనుమతులపై మస్క్‌ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం

ఓట్ల తొలగింపుపై మోదీ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఓట్ల తొలగింపుపై మోదీ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి.. హైదరాబాద్‌లో ఇండియా కూటమి ఆందోళన
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి.. హైదరాబాద్‌లో ఇండియా కూటమి ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!