
సినిమాలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం, వరుస సెలవుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1, 5 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేల మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నప్పటికీ, రోజు ముగిసే సమయానికి మరో 30 వేల మంది వరకు దర్శనం కోసం వేచి ఉంటున్నారని టీటీడీ తెలిపింది. రద్దీ దృష్ట్యా సెప్టెంబర్ 30, అక్టోబర్ 4 తేదీల్లో సిఫార్సు లేఖలను స్వీకరించబోమని పేర్కొంది. అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు భక్తులు టీటీడీ నిర్ణయాలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!