
రాజకీయాలు

2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో నిన్న ఊరట లభించింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత కె.కె. మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్ దాఖలు చేసిన రెండు ఎన్నికల పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. నామినేషన్ సమయంలో వాస్తవాలను వెల్లడించలేదని పిటిషనర్లు ఆరోపించారు.
ఈ కేసును విచారించిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, అవినీతి ఆరోపణలు చేయడం మాత్రమే సరిపోదని, వాటిని నిరూపించే స్పష్టమైన ఆధారాలు సమర్పించాల్సిన బాధ్యత పిటిషనర్లదేనని పేర్కొన్నారు. ఊహాజనిత ఆరోపణల ఆధారంగా ఎన్నికల పిటిషన్లను అనుమతించలేమని స్పష్టం చేస్తూ, సరైన ఆధారాలు లేవన్న కారణంతో రెండు పిటిషన్‌లను కొట్టివేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!