

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ తెలంగాణలో ప్రారంభమయ్యాయి. నైజాంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండగా, బుక్‌మైషోకు బదులుగా డిస్ట్రిక్ట్ యాప్‌లో ప్రత్యేకంగా టికెట్లను అందుబాటులో ఉంచారు. మైత్రీ థియేటర్లతో పాటు కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.50 టికెట్‌ను రూ.100కు, రూ.100 టికెట్‌ను రూ.150కు, బాల్కనీ టికెట్‌ను రూ.200కు విక్రయిస్తున్నారు. వీటికి జీఎస్టీ, ఇతర ఛార్జీలు అదనం. మార్నింగ్ షో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘ది ప్యారడైజ్’ తల్లీకొడుకుల కథతో పాటు ఒక సవారీ జాతి నేపథ్యాన్ని చూపించే విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలోని పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన గ్లింప్స్, ‘ఆయా షేర్’, ‘ఏషనాగుల’ పాటలు, టీజర్ ఇప్పటికే సినిమాపై మంచి బజ్‌ను తీసుకొచ్చాయి. చరిత్రలో చిలుకలు, పావురాల గురించి రాశారుగానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదనే భావనతో, అణచివేతకు గురైన ఒక జాతి తిరుగుబాటు కథగా సినిమాను పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!