

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి సబ్సిడీతో కూడిన ధరకు దేశీయ ఎల్పీజీ రీఫిల్ బుక్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. ఇప్పటికే ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. సబ్సిడీ ప్రయోజనం అర్హులైన వినియోగదారులకు మాత్రమే చేరేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
ఆధార్ అథెంటికేషన్‌ను ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సమయంలోనే, సంబంధిత పంపిణీదారు కార్యాలయంలో లేదా ఆయా చమురు మార్కెటింగ్ సంస్థల మొబైల్ యాప్‌ల ద్వారా పూర్తి చేసుకోవచ్చు. అథెంటికేషన్ పూర్తి చేయని వినియోగదారులు కూడా ఎల్పీజీ పొందవచ్చని, అయితే సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు సిలిండర్ సరఫరా అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ 1లోపు అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని వినియోగదారులను కోరింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!