

టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ కీలక అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 17న టాటా సన్స్ బోర్డు చంద్రశేఖరన్‌ను మరోసారి చైర్మన్‌గా నియమించేందుకు ఆమోదం తెలిపినప్పటికీ, ఈ తీర్మానం చెల్లదని టాటా ట్రస్ట్స్ పేర్కొంది. కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం చైర్మన్ నియామకం లేదా పునర్నియామకానికి ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్లలో మెజారిటీ మద్దతు అవసరమని తెలిపింది. టాటా సన్స్ బోర్డులో ట్రస్ట్స్‌కు ఇద్దరు నామినీ డైరెక్టర్లు ఉండగా, వారిలో ఒకరైన నోయెల్ టాటా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అవసరమైన మద్దతు లభించలేదని ట్రస్ట్స్ వాదించింది.
చంద్రశేఖరన్ పునర్నియామకానికి సంబంధించి చైర్మన్‌కు ఉన్న కాస్టింగ్ ఓటు ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దలేమని టాటా ట్రస్ట్స్ స్పష్టం చేసింది. ట్రస్ట్స్ ప్రకారం, బోర్డు స్థాయిలో సమాన ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే కాస్టింగ్ ఓటు వర్తిస్తుందని, నామినీ డైరెక్టర్లకు సంబంధించిన ప్రత్యేక మద్దతు నిబంధనను అది అధిగమించలేదని పేర్కొంది. మరోవైపు, చంద్రశేఖరన్ పునర్నియామకానికి బోర్డులో నలుగురు డైరెక్టర్లు మద్దతు ఇవ్వగా, నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ పరిణామంతో టాటా సన్స్ పాలన, నాయకత్వంపై సంస్థలో విభేదాలు బహిర్గతమయ్యాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!