
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 28న ఓటర్ల నమోదు షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. అర్హులైన ఉపాధ్యాయుల నుంచి నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ల దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది జాబితాను సిద్ధం చేయనున్నారు.
డిసెంబర్ 30న ఉపాధ్యాయ తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ప్రస్తుత సభ్యుల పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుంది. దీంతో తదుపరి ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితా ప్రక్రియను ఎన్నికల సంఘం ముందుగానే చేపడుతోంది. అర్హత ఉన్న ఉపాధ్యాయులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!