
జనరల్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంను దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ, రంజాన్ పండుగకు రూ.33 కోట్లు కేటాయిస్తే బోనాల కోసం కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఇవ్వడం అన్యాయమని అన్నారు. జంట నగరాల్లో వేలాది దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవని విమర్శించారు.
హిందూ పండుగల పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చూపుతోందని ఆయన ఆరోపించారు. పండుగల నిధులను జనాభా ప్రాతిపదికన సమానంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ కూడా బోనాల నిధుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!