
రాజకీయాలు

ఉత్తరాంధ్ర జిల్లాలకు రాబోయే మూడు గంటల పాటు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేశారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్షాలతో పాటు గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!